Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం విక్రయానికి తప్పని తిప్పలు
- అవసరమయ్యే గన్నీ బ్యాగులు 17లక్షల50వేలు
- అందుబాటులో ఉన్నవి 9,31,549 గన్నీబ్యాగులు
- ఇంకా కావాల్సిన బ్యాగులు 8,18,451
- మిల్లర్ల నుంచి తీసుకోవడానికి అధికారుల నిర్ణయం
- ధాన్యం అధికంగా వస్తే సేకరణ, లిఫ్టింగ్ కష్టమే
- తరుగు పేరిట దోపిడీకి చెక్ పెట్టాలని రైతుల వేడుకోలు
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. కానీ అందుకు అవసరమేన గన్నీ బ్యాగుల కొరత వేదిస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటి వరకు ఒకటీ రెండు ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభించారు. పూర్తి స్థాయిలోకేంద్రాలను ప్రారంభిస్తే గన్నీ బ్యాగుల కొరత తీవ్రం కానుంది. రంగారెడ్డి జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత వెంటాడుతోంది. వాస్తవానికి ధాన్యం సేకరణకు నెల రోజుల ముందే పౌరసరఫరాల శాఖతో పాటు పౌరసరఫరాల సంస్థ గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. కానీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పెరగకపోవడంతో ధాన్యం సేకరణతో పాటు ఎగుమతి కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ స్థాయిలో టీఆర్ఎస్ ధర్నాకు దిగింది.రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసవరమైన అన్ని ప్రాంతాల్లో ధాన్యంసేకరణకేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఒక్క గింజనూ వదలకుండా కొనుగోలు చేస్తామన్నారు. దాంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగమైంది. జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఐకేపీ, పీఎసీఎస్, డీసీఎంఎస్, ఎఫ్ఎస్సీఎస్, ఏఎంసీ ఆధ్వర్యంంలో కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళు చేస్తామని అధికారులు ప్రకటించారు.
1,18లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం
ఈ యాసంగిలో 1.18లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకుగానూ జిల్లాలో 41 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టనున్నారు. అయితే గన్నీ బ్యాగులు కేవలం 17లక్షల50వేలు అవసరం కానున్నాయి. కానీ కేవలం 9,31,549 గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉండడంతో సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. మే నెలలో అధికంగా కోతలు ఉంటాయని అధికారులంటున్నారు. అయితే ఇప్పటికే కోతలు మొదలయ్యాయి. కేం ద్రాల్లోకి ధాన్యం అధికంగా వస్తే, గన్నీ బ్యాగులు లేకుంటే ఎగుమతి కష్టతరంగా మారుతుంది. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్ల ద్వారా దాదాపు ఇంకా అవసరమైన గన్నీ బ్యాగులు సేకరించాలని బావిస్తున్నారు. కానీ మిల్లర్లు ఏ మేరకు సహకరిస్తాన్నది ప్రశ్నార్థకమే. ప్రభుత్వం ఆగమేఘాల మీద ధాన్యం కొనుగోలు చేయాలని చెబుతున్న తదనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం చెందారు. ధాన్యం అధికంగా వస్తే గన్నీ బ్యాగులు లేకుంటే, లారీల్లోకి ఏ విధంగా ధా న్యాన్ని ఎగుమతి చేస్తారనేది ప్రశ్నార్థకమే.
అవసరం 17.50లక్షల బ్యాగులు
జిల్లాలో17లక్షల50 వేలు గన్నీ బ్యాంగులు అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు పౌరసరఫరాల శాఖ వద్ద కేవలం 9,31,549 గన్నీబ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నవి. ఇంకా 8,18,451 బ్యాగులు అవసరం ఉంది. వాటిని మిల్లర్ల నుంచి తీసుకోవడానికి అధికారుల కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా ఏర్పాటు చేయాలనుకున్న 41 కేంద్రాలను ప్రారంభిస్తే.. ధాన్యం అధికంగా రానుంది. ఇక సేకరణ, లిఫ్టింగ్ కష్టమనే చెప్పాలి.
నాణ్యత పేరిట ఇబ్బందులు..
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు కసరత్తు చేస్తున్న తరుణంలో నాణ్యత పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. తరుగు పేరుతో రైతుల నుంచి అధికంగా ధాన్యం సేకరిస్తుంది. క్వింటాలకు ధాన్యం సేకరిస్తే 3 నుంచి 5 కిలోల ధాన్యం తరుగు కింద కోత పెట్టనుంది. క్వింటాకు రూ.1960 మద్దతు ధర చెల్లించి ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. అయితే జిల్లాలో గతంలో పలుమార్లు ధాన్యం కొనుగోళ్లలో తరుగు, తేమ ఇతర నాణ్యత ప్రమాణాల పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలున్నాయి. ఈ సారి అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయా, లేక రైతులను ఇబ్బందులపాలు చేస్తారా అనేది వేచి చూడాల్సి వస్తోంది.
తక్షణం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
జిల్లాలో యాసంగీ వరి కోతలను ప్రారంభమయ్యాయి. ఇంకా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ధాన్యం చేతికొచ్చిన తరువాత రైతులు పెట్టుబడుల కోసం ప్రయివేటు మిల్లర్ల వద్ద విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో రైతులను ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, గోనె సంచులను రైతులకు అందజేయాలి.
- సీహెచ్ ముసిలయ్య, రైతు సంఘంజిల్లా నాయకులు