Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మృతి చెంది న ఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధ వారం చోటుచేసుకుంది. ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ గ్రామానికి చెందిన మహేష్ (27) మండ లంలోని దిర్సంపల్లి గ్రామానికి చెందిన మొగు లయ్య కూతురు లలితతో రెండేండ్ల కిందట వివాహం చేసుకున్నాడు. అత్తగారింటికి దిర్సం పల్లికీ నివాసం ఉంటూ రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండు రోజుల కిందట భార్య, భర్తల మధ్య గొడవ రావ డంతో అప్పటి మహేష్ ఇంట్లో సరిగ్గా ఉండడం లేదు. దీంతో మనస్థాపానికి గురైన మహేష్ గ్రామ సమీపంలోని చింతచెట్టుకు ఉరివేసుకు న్నాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుం బ సభ్యులకు పోలీసులకు సమాచారం అందిం చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పరిగి ప్రభు త్వాస్పత్రికి తరలించారు. మృతుడు అన్న ఆనం ద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్సై విశ్వజన్ తెలిపారు.