Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బషీరాబాద్
బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామంలో బీరప్ప చెరువు సమీపంలో ఉపాధి కూలీలతో చెరువు పూడికతీసి కోసం పంట పొలాల్లో పనులకు పిల్లలను తీసుకెళ్తున్నారు.బుధవారం కూలీలతో గ్రామ సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులకు బదులుగా పిల్లలను పనిలో పెట్టుకోవద్దనీ, పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధమన్నారు. టెన్త్ ఇంటర్ పరీక్షలు దగ్గరపడుతున్నా నేపథ్యంలో పిల్లలందరూ రెగ్యులర్‌గా క్లాసులోకి అటెండ్ కావాలనీ, పరీక్షలు రాయాలని సూచించారు.వేసవి సెలవుల్లో బాల్య వివాహాలు తమ దృష్టికి వస్తే, 1098 చైల్డ్ లైన్‌కు కాల్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో 1098 సిబ్బంది హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.