Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కొండాపూర్‌లోని మసీద్‌బండ, లింగంపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్స్‌లో టెన్త్ క్లాస్ విద్యార్థినీ విద్యార్థుల కోసం రవికుమార్ యాదవ్‌తో ప్రత్యేకంగా ముద్రించిన స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్టడీ మెటీరియల్ కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టి లో ఉంచుకుని, నిపుణులైన ప్రొఫెసర్ల సమక్షంలో స్టడీ మెటీరియల్ ముద్ర ణ చేయించామని తెలిపారు. విద్యార్థులందరూ బాగా చదివి ప్రతి స్కూల్లోనూ వందశాతం ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల్లో పదోతరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఆర్‌కేవై ఫౌండేషన్ ద్వారా ఈ స్టడీ మెటీరియల్‌ని ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్లేశ్, రాఘవేంద్రరావు, అరుణ్ యాదవ్, విజరు పాల్గొన్నారు.