Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె. నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలో 'మన ఊరు-మనబడి' కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో పనుల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక డీపీఆర్సీ భవనంలో 'మన ఊరు-మన బడి' పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో మొదటి దశలో 371 పాఠశాలల్లో 'మన ఊరు-మనబడి' కింద ఎంపిక చేయగా, ఇప్పటివరకు కొన్ని మండలాలలో ఎస్టిమేషన్లు పూర్తిగా అప్ డేట్ కాలేదన్నారు. ఇట్టి పనులను వేగవంతం చేసి వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. లీడ్ స్టేట్మెంట్లు, ఇన్పుట్ డాటా ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రత్యేక నివేదికలను డీిఆర్డీఓ ద్వారా తనకు పంపినట్లయితే పరిపాలన అనుమతులు ఇస్తామన్నారు. అలాగే పాఠశాలల వారిగా పనులు పూర్తి చేసిన వాటికి పరిపాలన అనుమతులు, పాఠశాలలకు సాంకేతిక అనుమతులు మంజూరు చేయుటకు వీలు పడుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రతి పాఠశాల ఎంఓయూ జనరేట్ చేసి, సంబంధిత అధికారుల, పంచాయతీలో తీర్మానం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎంఓయు జనరేషన్, సంతకం తీర్మానం, తదితర అంశాలపై మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులైన ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.