Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో ఉన్న ఈరన్న చెరువులోని చేపలు విషప్రయోగంతో మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానిక ఉపసర్పంచ్ రాజమోని తిరుపతి, మత్స్యకారులు సత్యం, మద్దూరి సత్యం, రామస్వామి, జంగయ్య, యాదయ్య, శ్రీను, కృష్ణ, ఆంజనేయులు, శ్రీశైలం, వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం చెరువులో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో చేపలు పట్టడానికి వీలుకాలే దని ఇంతలోనే గిట్టనివారు ఎవరో ఇంత ఘాతుకానికి ఒడిగట్టారని వారు వాపోయారు. సుమారు రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసి పేంచిన 10 టన్నులకు పైగా ఉన్న చేపలపై విషప్రయోగం జరిగిన విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు. అదే విధంగా చేపల పెంపకానికి లక్షల రూపాయలు వెచ్చించి నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.