Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలతో ఉత్తీర్ణులు కావాలని తొలుకట్ట గ్రామ సర్పంచ్ కె శ్రీనివాస్ అన్నారు. బుధవారం మొయినాబాద్ మండలం లోని తొలుకట్ట ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న 37 మంది విద్యార్థులకు సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ పేపర్లు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కుటుంబ ఆర్థిక స్థితిగతులు సరిగాలేక చదువుకోవడానికి మెరుగైన సదుపాయాల కొరత ఉంటుందని ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలే కాకుండా సులభంగా అర్థ్ధమయ్యే మోడల్ పేపర్స్ వారికి మంచి ఫలితాలు రావడానికి తోడ్పడుతాయన్నారు. మంచి ఉత్తీర్ణత సాధిస్తే పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు పేరు, విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుం దన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుకా, ఉపాధ్యా యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.