Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఐఎం తాలూకా అధ్యక్షులు ఎస్ బి గుల్షన్
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని బెల్టు షాపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా ఉంచాలన్ని ఎంఐఎం తాలూకా అధ్యక్షులు ఎస్ బి గుల్షన్ అన్నారు. కొడంగల్ పట్టణంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ చిన్నచిన్న హౌటళ్లతో మొదలుకుని కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహ రించడం తగదన్నారు. మద్యం విక్రయాలు వైన్స్ దుకాణాల్లో కంటే బెల్టు షాపుల్లో జోరుగా కొనసాగుతుండటం శోచనీయం. రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగుతుండటంతో యువత చెడు మార్గంలో పయనిస్తూ ఘర్షణలకు తావిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసైన చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆకతాయిలు ఘర్షణ లకు దిగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన దుస్థితి నెల కొందన్నారు. దీనిపై స్థానిక పోలీసులు కూడా రాత్రి వేళల్లో ప్రతి వార్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తూ మద్యానికి బానిసై గొడవలు, ఘర్షణలకు దిగుతున్న వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు.