Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకర్పల్లి ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
మండలంలోని అంగన్వాడీ కేంద్రాల పిల్లలందరికీ నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందించాలని శంకర్పల్లి ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంగన్ వాడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో టాయి లెట్లు నిర్మాణం కోసం ప్రతిపాదనలు తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్రాల్లో ఎలక్ట్రిసిటీ కోసం కూడా ప్రతిపాదనలు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. అదేవిధంగా అంగన్వాడీలోపోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు, కిశోర బాలికలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, అంగన్వాడీ సూపర్వైజర్ యశస్విని, అంగన్వాడీ టీచర్లు తదితరులున్నారు.