Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ ప్రెసిడెంట్ సతీష్‌కు ఎమ్మెల్యే అభినందన
నవతెలంగాణ-శంషాబాద్
మండల పరిధిలోని నర్కుడ గ్రామానికి చెందిన మల్కారం పీఎసీఎస్ చైర్మెన్ బూర్కుంట సతీష్ నిన్న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ను శుక్రవారం నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్‌ను శాలువాతో సన్మానించి, అభినందించారు. సతీష్ ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కే చంద్రా రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నీరటి రాజు ముదిరాజ్, శివాజీ , నీరటి శేఖర్, లింగం శ్రీశైలం , బల్లేపు రాజు తదితరులు పాల్గొన్నారు .