Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో పందుల బెడద ఎక్కువైందని ఆ కాలానికి వాసులు, సింగపురం రాములు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం శంకర్పల్లిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తమ కాలనీలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. పందులు స్వైర విహారం చేస్తున్న వల్ల కాలనీకి చెందిన చిన్న పిల్లలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. పందులు ఇండ్లలో మధ్య తరగడంతో ఇబ్బందిగా మారిందన్నారు. పందులను ఆదర్శనగర్ కాలనీ నుంచి తొలగించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ యాదగిరి వివరణ కోరగా పందుల యజమానులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిం దన్నారు. మూడు రోజులు సమయం అడిగారని మూడు రోజుల తర్వాత పందులను తొలగించకపోతే మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగిందన్నారు.