Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య
- ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ
నవతెలంగాణ-కొత్తూరు
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల తల్లి దండ్రులకు కల్యాణలక్ష్మి పథకంఅండగా నిలిచిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన కొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిన్నింటి మధు సూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా హాజరై, 10మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, ముస్లిం సోద రులకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిరు పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ఆదుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అమలవు తున్నన్ని సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాములు, ఎంపీడీవో శరత్చంద్రబాబు, డిప్యూటీ తహసీల్దార్ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ భాతుక లావణ్య దేవేందర్ యాదవ్, వైస్ ఎంపీపీ శోభా లింగ నాయక్, నాయకులు ఎమ్మే సత్య నారాయణ, పెంట నోళ్ల యాదగిరి, గూడూరు సర్పంచ్ బి. సత్తయ్య, మల్లాపూర్ తండా సర్పంచ్ రవి నాయక్, మక్తగూడ సర్పంచ్ రాజు, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేంద్రగౌడ్, కోడిచెర్ల ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, తీగాపూర్ రైతు కోఆర్డినేటర్ మైస గళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.