Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలోనే లోయపల్లిలో దాన్య కొనుగోలు కేంద్రం ఏర్పాటు
- రైతు సంఘం జిల్లా నాయకులు కొర్ర శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-మంచాల
రైతులు వరి ధాన్యం దళారులకు విక్రయించి పోసపోవద్దనీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ధాన్య కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం క్వింటాల్‌కు రూ.1,960 రూపాయల చొప్పున పొందాలని రైతు జిల్లా నాయకులు,మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని లొయపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ మండలంలో బోడకొండ, నోముల, చిత్తపూర్ మూడు కేంద్రాల్లో మాత్రమే ధాన్య కొనుగోలుయకేంద్రాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి పంట ఎక్కువగా పండే లోయపల్లిలో ధాన్యకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. లోయపల్లి ప్రాంతంలో సుమారు 1800 ఎకరాలలో రైతులు వరి పంట వేసినట్టు తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారని అన్నారు. రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకుని, లోయపల్లి గ్రామంలో ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్, డీసీఎంఎస్ కార్యదర్శితో మాట్లాడినట్టు వివరిం చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు.