Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు
- డి రామచందర్, జిల్లా ఉపాధ్యక్షులు బి శ్రీనివాస్
నవతెలంగాణ- కందుకూరు
ఉపాధి హామీ కూలీలకు డబ్బులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు డి రామ్‌చందర్, జిల్లా ఉపాధ్యక్షులు బిశ్రీని వాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ గ్రామాలలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారుగా కోటి రూపాయలు కూలీల డబ్బులు రావాల్సి ఉన్నా బ్యాంకు ఖాతాల్లో కూలీల డబ్బులు ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బుల ఇవ్వాలని మే2న కందుకూరు ఎంపీడీవో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహింస్తామని తెలి పారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఉపాధి హామీ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొ ని విజయవంతం చేయాలని కోరారు.