Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి అన్నారు.శుక్రవారం కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం పేద ప్రజలకు వరంలాంటిదన్నారు. ఆడపడుచుల పెండ్లీలు తల్లి దండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్, జడ్పీటీసీ రాందాస్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హరిక్రిష్ణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ కుల్కచర్ల మండలాధ్యక్షులు సేరి రాంరెడ్డి, చౌడాపూర్ మండలాధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు రమేష్, అశోక్, వైస్ ఎంపీపీ రాజశేఖర్ గౌడ్, సర్పంచులు,ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.