Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
- అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తాం
- జిల్లా కలెక్టర్ కె. నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
నిరుద్యోగ యువత పోటీపరీక్షల్లో ఉద్యోగాలు సాధించి కుటుంబానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీ పద్మనాభా కళాశాలలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రూపులకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు శాఖల పరంగా చర్యలు చేపట్టిన శిక్షణా శిబిరాలను సద్వినియోగించుకోవాలన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వివిధ శాఖల్లో ఖాళి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.యువత ఇప్పుడు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ప్రతి కుటుంబంలో వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ఉద్యోగ సాధిం చాలనే పట్టుదలతో చదువుకోవాలని చెప్పారు. శిక్షణ ఇచ్చే రెండు నెలలు భోజన వసతి కల్పించ నున్నట్టు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యువతీ, యువకుల విజ్ఞప్తి మేరకు అధికారులతో మాట్లాడి, వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ శిక్షణలో భాగంగా స్టడీ మెటీరియల్ అందిస్తామనీ, ఇంకా ఏమైనా సబ్జె క్టులకు సంబంధించి మెటీరియల్ కావలసి వస్తే అధికారుల దృష్టికి తీసుకువస్తే, అదనంగా సమకూ రుస్తామని కలెక్టర్ తెలిపారు. శిక్షణ శిబిరంలో ఎక్కువ సంఖ్యలో యువతీలు ఉండడంపై కలెక్టర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, జిల్లా ట్రైబల్ అభివృద్ధి అధికారి కోటాజీ , ఎస్ఏపి కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సోమన్న అధ్యాపకుడు నారాయణరావు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.