Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.7లక్షల నిధులతో అండర్ డ్రయినేజీ పనులకు శంకుస్థాపన
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
నియోజకవర్గ అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన కు పెద్దపీట వేస్తున్నామని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌లో రూ.2లక్షల ఎంపీటీసీ నిధు లు, రూ.5లక్షల మున్సిపాలిటీ నిధులతో అండర్ డ్రయి నేజీ పనులనుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రశేఖరరావు హయాం లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరు చేయించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మిషన్ కాకతీ య పథకంతో చెరువులు అన్ని నిండుకుండలా మారా యని ఆయన పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్, వైస్ చైర్మెన్ రవీందర్, ఎంపీ పీ మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్స్ చంద్రకళా రాజేందర్ గౌడ్, కోస్గి శ్రీనివాస్, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్‌గౌడ్, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, బాతుక దేవేందర్ యాదవ్, ఏనుగు జనార్దన్ రెడ్డి, మాధ వరెడ్డి, రేనట్ల రాజేందర్ గౌడ్, మక్త గుడా సర్పంచ్ రాజు, నేనావత్ గోపాల్ నాయక్, బ్యాగరి యాద య్య కోడిచెర్ల ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి మున్నూరు పద్మారావు, సిటీకేబుల్ వెంకటేష్ పాల్గొన్నారు.