Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనం పల్లి జైపాల్ రెడ్డి
నవతెలంగాణ- రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ సర్కిల్లో మేడేను ఘనంగా నిర్వ హించాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనం పల్లి జైపాల్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్లోని ఏఐటీయూసీ కార్యాలయం లో మండల కార్యదర్శి టి ఆనంద్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 135 సంవత్సరాల కిం దట అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మిక వర్గం 8 గంటల పని దినాలకు ఉద్యమిస్తే అక్కడి నిరంకుశ ప్రభు త్వం కార్మికులపై వివక్ష రహితంగా కాల్పులు జరిపి కార్మికులను పొట్టన పెట్టుకున్న సందర్భంగా కార్మిక శ్రమజీవుల ఐక్య దినంగా ప్రపంచంలోనూ మేడే దినో త్సవం నిర్వహిస్తారని తెలిపారు. మన దేశంలో కార్మిక వర్గం గల్లీ నుండి ఢిల్లీ దాకా మేడే ఉత్సవాలను నిర్వహి స్తారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావా లని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల నాయకులు సాయిలు, రామకృష్ణ, దానేలు, శ్రీను, రాజు, సంతోష, నాగమ్మ, శాంతమ్మ, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.