Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
- నోవో టెల్ ఎయిర్ పోర్ట్లో ఫిక్కీ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు
నవతెలంగాణ- శంషాబాద్
సమాజంలో ఆటుపోట్లు సహజమని పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సమస్యలు ఉంటా యని ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కృషి చేస్తే ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శుక్రవారం శంషాబాద్ నోవాటెల్ ఎయిర్ పోర్ట్ హౌటల్లో ఫిక్కి ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగంలో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉందనే అపోహ నుంచి బయటపడాలని సమస్యలను సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు రావాలని సూచించా రు. మహిళల పారిశ్రామికవేత్తలు ఎంతోమంది తమ ప్రతిభను చాటుతూ దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందిస్తున్నారని కొనియాడారు. మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రధానంగా ఎయిర్ఫోర్స్ ఇంజనీరింగ్ మెడికల్ లా అండ్ ఆర్డర్ వంటి ప్రాధాన్యత కలిగిన అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అన్నిటికంటే ముందు పరిశ్రమల అభివద్ధికి పొదుపు ఆర్థిక ప్రణాళిక ముఖ్యమని సూచించారు. అనవసరమె ౖన ఖర్చులు చేయకుండా మార్కెట్ అంచనా ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులు చేసి మార్కెట్ మెలకువలు సాధించాలని సూచించారు. పరిశ్ర మల ఏర్పాటు నిర్వహణ సామర్థ్యం మార్కెట్ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు సాగాలని సమాజంలో సవాళ్లను ఎదుర్కొంటూ రాణిస్తే మహిళా పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి డోకా ఉండదని భరోసా కల్పించారు. దేశీయ అంతర్జాతీయ జీవనశైలిల ప్రకారం మన అవసరాలకు తగ్గట్టు మహిళలు రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వికె సింగ్ పాటిల్, జి. కిషన్ రెడ్డి, మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.