Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
కార్మికుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణ కేంద్రంలోని 16వ వార్డులో మేడే సంబురాలు, ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా 16వ వార్డు ప్రెసిడెంట్ ఉదరు రెడ్డి ఆధ్వర్యంలో మేడే సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మున్సిపల్ చేపట్టిన తాటికొండ స్వప్న పరిమళ్ హాజరయ్యారు. మేడే సందర్భంగా కార్మికులు పనులను వారి శ్రమ ను గుర్తించి , ఔట్ సోర్సింగ్, ఆశ వర్కర్స్, ఎం వాటర్ మెన్ వర్కర్స్, మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్సీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్స్ తాటికొండ స్వప్న పరిమల్, సీనియర్ నాయకులు పట్ల్లోళ్ళ బాల్రెడ్డి, పరిమల్, కేశవ్, బోయరాజు, మోయిన్, వార్డు కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.