Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెచ్చిపోతున్న రియల్టార్లు
- అధికార పక్ష నాయకుల అండ
నవతెలంగాణ-గండిపేట్
నార్సింగిల్లో విలువైన పార్కు స్థలాన్ని మింగేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం సెలవుల రోజు కావడంతో అధికార పక్ష నాయకుల అండతో రియల్టార్లు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయంలో పహారీ గోడను ఏర్పాటు చేసేందుకు రేకులతో కబ్జారాయులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం చూసే వరకు పూర్తిగా కబ్జా చేసి 16 వందల పార్కు స్థలాన్ని మింగేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జారాయుళ్ల అధికార పక్షం అండదండలున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. మున్సిపల్ అధికారులు పార్కు స్థలాన్ని కాపాడాలని 9వ వార్డు ప్రజలు కోరారు.