Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
నవతెలంగాణ-షాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయకుండా, కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఎర్రజెండాను ఎగురవేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశంలో అన్ని రంగాలల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారి హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుపడిదారులకు, కార్పొరేటర్లకు అనుకూలమైన విధానాలతో 4 కోట్లు తెచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే రాష్ట్ర భ్రు ఉతత్వం బస్సుచార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి వారి నడ్డివిరిచిందన్నారు. ప్రజా సమస్యల కోసం ఎప్పుడు సీపీఐ ముందుండి పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మ ండల కార్యదర్శి నక్కలి జంగయ్య, సహాయకార్యదర్శి రఘురాం, నాయకులు రాములు, రుక్కయ్య, శివ, మధు, రామకృష్ణ, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.