Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందానగర్
హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు నుంచి దీప్తి శ్రీ నగర్ నాల వరకు వయా జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65 వరకు రూ.15.88 అంచనా వ్యయంతో 2.4 కి మీ ల మేర చేపడుతున్న నాల విస్తరణ పనులలో భాగంగా మదినగూడా రామ కష్ణ నగర్లో జరుగుతున్న నాలా విస్తరణ పనులను ఇరిగేషన్ అధికారులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం వ్యూహాత్మక నాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈర్ల చెరువు నుంచి దీప్తి శ్రీ నగర్ నాల వరకువయా జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65 వరకు నాలా విస్తరణ పనులు చేపడుతున్నట్టు తెలి పారు. ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా నాలా విస్తరణ పనులు చేపడుతున్నట్టు వివరించారు. రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధికారులు సమన్వయంతో కలిసి పని చేసి పనులలో పురోగతి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ పావని, టీఆర్ఎస్ హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు వాలా హరీష్, చందానగర్ డివిజన్ అధ్య క్షులు రఘునాథ్‌రెడ్డి, ఉమామహేశ్వర రావు, సురేం దర్, వీరభద్రరావు, విష్ణువర్ధన్‌రెడ్డి, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.