Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా నాయకత్వంలోనే ప్రత్యామ్నాయ విధానం
- ఎనిమిదేళ్లలో 80 వేల ఉద్యోగాలా?
- 3లక్షల ఖాళీలు ఏమయ్యాయి?
- బీజేపీ గూటిలో కాలు పెట్టిన టీఆర్ఎస్
- కమ్యూనిస్టులు సూచనలను కేసీఆర్ నాలుక తిప్పి మాట్లాడుతున్నారు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వామపక్ష సంఘటన నిర్మాణమే కమ్యూనిస్టుల లక్ష్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ సంఘటన అవసరమన్నారు. అది వామపక్ష సంఘటనతోనే సాధ్యమవుతుందన్నారు. ఆ లక్ష్యంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో కషి జరుగుతుందని చెప్పారు. కార్మిక, సంక్షేమ నిర్మాణమే అభివద్ధికి ఆస్కారం లభిస్తుందని వివరించారు. ఆ ప్రత్యామ్నాయ విధానాలను ఎర్రజెండా ప్రకటించిందన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చేస్తున్నదని మండిపడ్డారు. కులం, మతం పేరుతో హత్యా రాజకీయాలు నడుపుతున్నదన్నారు. విద్యా రంగాన్ని కాషాయీకరణ చేసేందుకు పూనుకుం టుందన్నారు. కార్మికుల హక్కులను ఆలోచివేసే చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడిన కమ్యూనిస్టులకు బీజేపీ నాయకత్వంలోని బుల్డోజర్లు అడ్డుకాదన్నారు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఎర్రజండా నాయకత్వంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు.
జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేయకుండా 493 జీవో అమల్లో ఉందని చెబుతున్న ప్రభుత్వం రాంజీ కంపెనీకి 700 ఎకరాల భూమిని ఇచ్చి ఇండ్ల స్థలాల వ్యాపారానికి ఎందుకు అనుమతించిందని ప్రశ్నించారు. ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఇవ్వడంలో అడ్డు వస్తున్న 493 జీవో ఆ సంస్థకు ఎందుకు అడ్డు రావడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో 1556 కంపెనీలు ఉంటే స్థానికులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 60 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్నారు. టెక్నికల్ ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం లేన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి, సామెల్, పి.యాదయ్య, జగదీష్, మండల కార్యదర్శులు సీహెచ్ జంగయ్య, నర్సింహ, శ్యామ్సుందర్, ఇ నర్సింహ, ప్రజా సంఘాల నాయకులు కిషన్, రాంచందర్, జగన్, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, ఆర్ జంగయ్య, నర్సింహ, సుమలత, రవికుమార్ ఉన్నారు.