Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మెన్ బుస్సు పుల్లారెడ్డి, తహసీల్దార్ దేవుజ
నవతెలంగాణ-మంచాల
మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్టు పీఏసీఎస్ చైర్మెన్ బుస్సు పుల్లా రెడ్డి, తహసీల్దార్ దేవుజ తెలిపారు. ముస్లీంలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. అందరూ కలిసి మెలసి ఉండాల న్నారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లీంలకు దుస్తులు పంపిణీ చేస్తోందని, అలాగే ఇఫ్తార్ విందుకు నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాల సర్పంచ్ అనిరెడ్డి జగన్‌రెడ్డి, ఎంపీటీసీ ఎడ్మ నరేందర్‌రెడ్డి, ఆరుట్ల ఎంపీటీసీలు చీరాల రమేశ్, కావలి శ్రీనివాస్, జపాల్ ఎంపీటీసీ లట్టుపల్లి చంద్ర శేఖర్‌రెడ్డి, అంబొత్ తండ ఎంపీటీసీ అంబొత్ రాందాస్, బోడ కొండ ఉపసర్పంచ్ వనపర్తి బద్రినాథ్ గుప్త, మైనార్టీ సంఘం నాయకులు ఎండి జానీ పాషా, ఎండి సలాం ఆజాద్, షేక్ జహీర్ ఆజాద్, సయ్యద్ హపిజ్ పాషా, సద్దాం హుస్సేన్, సయ్యద్ రహీం, ఇర్పాన్ తదితరులు ఉన్నారు.