Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటంరాజు
నవతెలంగాణ- కోడంగల్
మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం ఐక్యంగా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటంరాజు అన్నారు. కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ము న్సిపల్ వర్కర్స్ మహిళా నాయకురాలు వెంకట్ లక్ష్మి జెండా ఆవిష్కరించారు. మేడే కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుత్స చంద్రయ్యతో కలిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెట్టి చాకిరి నుం చి విముక్తి పొంది ఎనిమిది గంటల పని దినం కార్మిక హక్కు చట్టాలు సాధించిన రోజే మేడే అన్నారు. 8 గంటల పని దినం కోసం కార్మికవర్గం పోరాడి, త్యాగా లతో సాధించుకున్న హక్కుల కోసం ప్రాణాలను తృణ ప్రాయంలో అర్పించిన కార్మిక నాయకుల స్పూర్తికి చి హ్నం మేడే అన్నారు. బానిసత్వం నుండి విముక్తి కా వాలని, పెట్టుబడిదారి ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడి హక్కులు సాధించుకుందన్నారు. అలాంటి హక్కులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం హరించి వేస్తుందన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య మున్సి పల్ వర్కర్స్ అధ్యక్షులు పకీరప్ప, కార్యదర్శి కిష్టప్ప, కోస్గి వెంకటప్ప, రాములు, సుగుణమ్మ, వెంకటలక్ష్మి, వెంక టమ్మ, దౌల్తాబాద్ మండల గ్రామపంచాయతీ వర్కర్స్ అధ్యక్షులు కుర్బని సాయిలు, కార్యదర్శిగౌస్, బొంరా స్పేట్ మండలంలోని గ్రామపంచాయతీ వర్కర్స్ అధ్య క్షులు మల్లేష్ యాదవ్, కార్యదర్శిసుభాన్పాలొ ్గన్నారు.