Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవార్డుతో బాధ్యత పెరిగింది
- కార్మికుల శ్రేయస్సుకోసం నిరంతరం కృషి చేస్తా
- టీఆర్ఎస్ కె.వి జిల్లా అధ్యక్షుడు భూమెల్ల కృష్ణయ్య
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
తెలంగాణ ప్రభుత్వం మేడే సందర్భంగా నిరం తరం కార్మికులకు సేవ చేస్తున్న కార్మిక నాయకులకు అందజేసే శ్రమశక్తి అవార్డు 2022 వికారాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు భూమొల్ల కృష్ణయ్యకు దక్కింది. హైదరాబా ద్లోని రవీంద్ర భారతిలో కార్మిక శాఖ మంత్రి చామ కూర మల్లారెడ్డి, హౌం శాఖ మాత్యులు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ లేబర్ డిపార్ట్మెంట్ రాణి కుముదిని చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరా డుతూ అనేక సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కరించడంలో ముందున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా ప్రము ఖ కార్మిక నాయకుడిగా జిల్లాలో గుర్తింపు తెచ్చుకు న్నారు. కార్మిక ఉద్యోగాలకు చేసిన సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి 2022 మే డే శ్రమశక్తి అవార్డుని ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, మాజీ అధ్యక్షులు రూప్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణలకు ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డుతో తనపై మరిత బాధ్యత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ జిల్లా నాయ కులు, టీఏసీ సభ్యులు ఉంగురు కృష్ణ, గోపాలమిత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బందయ్య, ఉపాధ్యక్షులు యాదయ్య, జిల్లా నాయకులు నాగారం పవన్ కుమార్ పాల్గొన్నారు.