Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి
నవతెలంగాణ-చేవెళ్ల
కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు రామ స్వామి అన్నారు.ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో 136 మేడే సంబరాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఏఐటీయూసీ జెండా విష్కరి ంచారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరు వాత కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కార్పొ రట్ శక్తులకు తలవంచి, 44 రకాల కార్మిక చట్టాలను వారికి అనుకూలంగా మార్చి కార్మికలోకానికి తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు.ఈ దేశంలో పేద మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకూ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికుల కోసం పని చెప్పి, ఆదోని,అంబానీల ఆస్తులు పెంచుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ వేతన సవరణ చేయకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుం దన్నారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పాన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడుస్తున్న అమలు చేయడంలో విఫలమైయ్యారని విమర్శించారు. కార్యక్ర మంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్య నారాయణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభులింగం, వ్యకాస జిల్లా అధ్యక్షులు అంజయ్య, మండల కార్యదర్శి సుధాకర్ గౌడ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల,మాధవి, విజయమ్మ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మల్లేష్, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి శివయ్య, కార్మికులు వడ్ల శ్రీకాంత్, ఇంద్రారెడ్డి, శ్రీను జైపాల్ రెడి, ప్రశాంత్, మహేందర్ గౌడ్, బాలయ్య, భాస్కర్ ,జబ్బర్, చేవెళ్లలోని తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కార్మికులు పాల్గొన్నారు.