Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-దోమ
పార్టీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా మని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజవోని మల్లయ్య ఇటీవలే ప్రమాదవశాత్తు చనిపోవ డంతో అతనికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా చెక్కు రూ. 2లక్షలు మృతుడి భార్య మొగులమ్మకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికీ అండగా ఉంటామన్నారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి, మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్, సర్పంచ్ రాములు, లింగయ్య,పరిగి మార్కెట్ కమిటీ చెర్మెన్ సురేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఆంజనేయులు, పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.