Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ నుంచి దోమ లింక్ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తరితగతిన రోడ్డు పను లను పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశిం చారు. అనంతరం అదే గ్రామంలో కొందరు రైతులు తమ పొలాలకు వెళ్ళడానికి పానాది (రోడ్డు) బాగాలేదు అని చెప్పడం తో, వారికి సానుకూలంగా స్పందించి శత్వరలో పానాది మరమ్మతులు చేయిస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్‌కుమార్, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ సురేందర్, ఎంపీటీసీ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పిరంగి వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.