Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అధ్యక్షులు సంజీవ్
నవతెలంగాణ-నవాబుపేట
ఈ నెల 10 వికారాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా మహా సభను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ అన్నారు. శుక్రవారం నవబుపేట మండల కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. గడువు పొడగిస్తున్న అక్రిడేషన్ కార్డుల స్థానంలో వెంటనే నూతన అక్రిడేషన్లు జారీ చేయాలని, అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో జర్నలిస్ట్ హెల్త్ కార్డులు వర్తించేలా జీవో జారీ చేయాలని, జాప్యం చేయకుండా వెంటనే ఇండ్ల స్థలాలు, డబులు బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాండు, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.