Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ మనోహర్‌రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లడుతూ గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా చూసి చలించిపోయారని, అందుకే నేడు రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని ఎమ్మెల్యే రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేషం, పీఎసీఎస్ చైర్మెన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ సుజాతవెంకట్రెడ్డి, మండల ప్రజాప్రతినిధిలు, గ్రామ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.