Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేవీపీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సోమారపు రవి
నవతెలంగాణ- మోమిన్‌పేట
హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కెేవీపీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సోమారపురవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోమిన్‌పేట్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరాజు కుటుం బానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రోజురోజుకూ హత్యలు పెరుగుతున్న నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించక పోతే ఆందోళనలు ఉధృ తం చేస్తామని వారు హెచ్చరించారు. ఇలాంటి దుశ్చర్య లకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించే కపోతే మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశముందని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం కఠినమైన నిర్ణ యం తీసుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేయా లన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్, కెేవీపీఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.