Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండ అని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నరు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి నివాసంలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. పరిగి నియోజకవర్గంలోని పుడూర్, పరిగి, దోమ, కుల్క చెర్ల, చౌడపూర్, గండీడ్, మహమ్మదాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 58 మంది అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నారు. వారందరికీ సీఎం సహాయనిధి ద్వారా రూ.19,96,000 మంజూ రు చేయించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసిల ద్వారా అందజేస్తున్నామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్‌కుమార్. ఎంపీపీలం అరవిం దరావు, సత్యమ్మ, జడ్పీటీసీలు హరిప్రియ ప్రవీణ్‌రెడ్డి, రాందాస్, పీఎసీఎస్ చైర్మెన్ శ్యాం సుందర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ భాస్కర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సర్పంచులు ప్రవీణ్, రాజిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కంకల్ప్రభాకర్, ఆంజనేయులు, దోమ శ్రీశైలం, లబ్దిదారులు తదిత రులు పాల్గొన్నారు.