Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
ఆరోగ్యానికి సీఎం రిలీఫ్‌ఫండ్ నిధులు సంజీవని వంటివన్నీ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో యాలాల మండల గొర్రెపల్లి గ్రామానికి చెందిన రూ.1,25,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల ఆరోగ్యం పాలిట సంజీ వని సీఎం సహాయ నిధి తోడ్పాటును ఇస్తున్నద న్నారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా సర్కారు కృషి చేస్తున్నదన్నారు. ఆపత్కాలంలో ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల భారిన పడుతున్న పేదలకు కార్పొరేట్ వైద్యంతో స్వస్థత పొందేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ఎంతో తోడ్పాటును అందిస్తున్న దన్నారు. ఆపదలో ఆపన్నహస్తాన్ని అందిస్తూ పేదలకు అండగా నిలుస్తు నిరంతర సేవలను కొనసాగిస్తా మని, ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు.తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ విఠల్ నాయక్, వైస్ చైర్మెన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, రవీందర్‌రెడ్డి, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.