Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ఎమ్మెల్యే గుర్కజైపాల్
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణ లో శుక్రవారం జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్య నాయక్, మార్కెట్ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మెన్ తోట గిరియాదవ్ తదితరులతో కలిసి కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కజైపాల్ యాదవ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. అదేవిధంగా తలకొండపల్లి మండలంలోని చుక్కాపూ ర్, తలకొండపల్లి, పడకల్ తదితర గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తూర్పాల పట్టడానికి వీలుగా ప్రభుత్వం సమకూర్చిన ప్యాడి క్లీనర్ మిషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. వెల్జాల్ గ్రామంలో ఏర్పా టు చేసిన వరి ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ప్రా రంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, గట్ల కేశవరెడ్డి, తహసీల్దార్ పాండు నాయక్, ఎంపీడీఓ వెంక ట్రాములు, ఆమనగల్ మున్సి పల్ చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మెన్ భీమ నపల్లి దుర్గయ్య, వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ముజీబుర్ రెహమాన్, ఏఎంసీ డైరెక్టర్లు సురమళ్ల సుభాష్, రమేష్‌నాయక్, నర్సింహ, శేఖర్, ఎంపీటీసీ కుమార్, మల్కేడి అంబాజీ, వైస్ చైర్మెన్ కూన రవికుమార్, రాంనుంతల సర్పంచ్ వడ్త్యావత్ సోనా శ్రీను నాయక్, ఉపసర్పంచ్ అజీజ్, నాయకులు సయ్యద్ ఖలీల్, ఎంగలి బాలకృష్ణ పాల్గొన్నారు.