Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల సమ్మె ముగింపు ర్యాలీ
- నార్సింగి అధ్యక్షులు మహేందర్‌యాదవ్
నవతెలంగాణ-గండిపేట్
కార్మికుల హక్కుల కోసం పోరాటాలకు మరింత పదును పెట్టాలని నార్సింగి మున్సిపల్ కార్మిక యూనియన్ సంఘం అధ్యక్షులు మహేందర్‌యాదవ్, కోశధికారి ఆమత్ అన్నారు. గండిపేట్ మండల తరుపున నార్సింగి, మణికొండ, బండ్లగూడ మున్సిపల్ కార్మికులు సంఘం తరుపున కాటెదాన్ల్లో నిర్వహించే ముగింపు సమ్మె ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు, సీఐటీయూ ప్రజా సంఘాల తరుపున పోరాటాలకు మార్గమన్నారు. అందుకు సీఐటీయూ నీడ కింద రాబోయో రోజుల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో హక్కుల కోసం ముందుకు రావాలన్నారు. కార్మికులందరికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ సీఐటీయు యూనియన్ తరుపున మహేందర్, ఐమత్, రవి, శ్రీకాంత్, జనార్థన్‌రెడ్డి, శ్రీను, రామ్జాన్ పాషా, శంశీ, రాహుల్, శ్రీనివాస్, చంద్, తదితరులు పాల్గొన్నారు.