Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీవాసుల ఫిర్యాదు
నవతెలంగాణ- శేరిలింగంపల్లి
ప్రశాంతంగా ఉండే కాలనీలో నిత్యం స్కూల్ బస్సుల హారన్ మోతలు వద్దంటూ కాలని వాసులు ఆక్షేపిస్తు న్నారు. ఎలాంటి నియమ నిబంధనలూ పాటించకుండా, అగ్గిపెట్టేలాంటి బిల్డింగ్‌లో అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్దంటూ కాలనీ వాసులు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌కు, జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి వినతిపత్రాలు అందజేశారు. నియోజకవర్గంలోని దీప్తి శ్రీనగర్ కాలనిలోని రోడ్ నెంబర్లు 18, 22,23 లలో ఉన్న ఐదు అంతస్థుల బిల్డింగ్‌లో స్కూల్ ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కాలని వాసులు తెలిపారు. కాలని సంక్షేమ సంఘం సభ్యుల నుండి కానీ, చుట్టు పక్కల ఇండ్ల వారినుండి ఎలాంటి అభిప్రాయాలనూ తీసుకోకుండానే నిబంధనలను ధిక్కరించిన స్కూల్ ఏర్పాటు అనుమతులుకు దరఖాస్తు. చేసుకున్న యాజ మాన్యానికి అనుమతులు మంజూరు చేయవద్దంటు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ప్రశాంతతను కోల్పోతాము: కాలనీ వాసులు
నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లమాధ్య ఏర్పాటు చేస్తున్న స్కూల్ వల్ల నిత్యం విద్యార్థుల రాకపోకలతో, అరుపులతో కాలనీవాసులు ప్రశాంతత కోల్పోతారని, స్కూల్ బస్సుల హారన్సౌండ్లతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కాలనీ వాసులు వాపోతున్నారు. కేవలం 30 ఫీట్ల రోడ్లలో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలతో ప్రమాదాలు సంభవించే అవకాశముందని కాలనీ వాసులు తెలిపారు. కాలనినీ సంక్షేమ సంఘం నుండి కానీ, చుట్టుపక్కల వారి అభిప్రాయాలను తీసుకొని యజమాన్యానికి అనుమ తులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని కాలనీ వాసులు హెచ్చరించారు.