Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్, సీీఐటీయూ, దళితప్రజాసంఘాల నాయకులు నిరసన
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 70 కులాంతర హత్యలు జరినప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడరని కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు, దళిత ప్రజాసంఘాల నాయకులు నిలదీశారు. ఆదివారం తాండూ రు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం సమీపంలో నాగరాజును హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని కేవీపీఎస్, సీఐటీయూ, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం yసీఐటీయూ, కేవీపీఎస్ జిల్లా నాయకులు మల్కయ్య, ఎమ్మార్పీఎస్ తాండూరు మండల అధ్యక్షులు నర్సింలు, బషీరాబాద్ మండలాధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 70 కులదురహంకార హత్యలు, దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగి నప్పుడు ఎక్కడ నిద్రపోతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కులదురం హాకార హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోతుందని అన్నారు.అణగారిన వర్గాలకు జరిగితే ఒక్క న్యాయం, దళిత వర్గాలకు మరొక్క న్యాయం అన్నట్టు వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా కులదురహాంకార హత్యలు పునరావృతం కాకుండా వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నాగరాజు బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు బాలు మల్కప్ప, రాములు, ఎమ్మార్పీఎస్ నాయకులు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.