Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే విచారించి, శిక్షించాలి
- సోషల్ డెమోక్రటిక్ పోరం నాయకులు
నవతెలంగాణ-మర్పల్లి
హైదరాబాద్ సరూర్ నగర్లో నడిరోడ్డుపై హత్యకు గురైన బిల్లీపురం నాగరాజు కుటుంబాన్ని సోషల్ డెమోక్రటిక్ పోరం నాయకులు మండల కేంద్రంలో నాగ రాజు కుటుంబాన్ని ఆదివారం పరామ ర్శించారు. సందర్భంగా ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్, కో కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నాగరాజు భార్య ఆశ్రీన్ సుల్తానా, చెల్లి రమాదేవి తండ్రి శ్రీనివాస్ తల్లి అన సూయతో మాట్లాడి జరిగిన ఘటన వివరాల గురించి అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకూ దళితులపై హత్యలు పెరుగుతూనే ఉన్నాయాన్నారు. నడిరోడ్డుపై నాగరాజు హత్య చేయడం, ప్రజలకు ఎలాంటి రక్షణ లేదని తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా విచారించి నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగ రాజు భార్య ఆశ్రీన్ సుల్తానాకు, చెల్లి రమా దేవికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, వారికి ఎస్సీ, ఎస్టీ చట్టంలో రక్షణలు కల్పించాలని కోరారు. నాగరాజు లాంటి ఘటనలు తెలంగాణలో పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కుటుంబానికి నిరంతరం పోలీసుల నిఘా ఉండేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో సూరేపల్లి సుజాత, నిమ్మ నారాయణ, రిటైర్డ్ జడ్జి వెంకట్ రెడ్డి, ప్రకాశ్, తదితరులున్నారు.