Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లిశంకర్
నవతెలంగాణ-కేశశంశపేట
షాద్‌నగర్ గడ్డపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న కొత్తపేట మాజీ పీఎసీఎస్ చైర్మెన్ కొండారెడ్డిపల్లి శంకర్ ఆశయాలను నిజం చేద్దామని కాంగ్రెస్ షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కేశంపేట మండల కేంద్రంలోని విశిష్ట విద్యాలయం ఆవ రణలో మండల అధ్యక్షులు గూడ వీరేశం, యూత్ అధ్యక్షులు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో త్రిపిశెట్టి శంకర్ మొదటి వర్థంతి, సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీర్లపల్లి శంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ యాదయ్య, మరి కొంతమంది నేతలు ముఖ్యఅతిథులుగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకరన్న మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టే సీఎం కేసీఆర్
విద్యార్థుల బలిదానాలను చూడలేక తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ అయితే, అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టే బుద్ధి సీఎం కేసీఆర్ దని వీర్లపల్లి శంకర్ విమర్శించారు. కొండారెడ్డిపల్లి శంకర్ ప్రథమ వర్థంతి, సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రైతులకు భరోసా కల్పించి వారికి అండగా ఉండాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తే, కేటీఆర్ తోపాటు టీఆర్ఎస్ నాయకులు లేనిపోని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అవునన్నా, కాదన్నా అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మని రాష్ట్ర ప్రజలు ఆమెకు రుణపడి ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలికిన హితవులు వాస్తవం కాదంటారా అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయక కేంద్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, పబ్బం గడుపు తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు టీఆర్ఎస్ పార్టీపై వ్యతి రకత వచ్చిందనీ,ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపే సమయం దగ్గరలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్, శ్రీధర్ రెడ్డి,రాంరెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, ఇబ్రహీం, గోపాల్, అన సూయ, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, పర్వతాలు, భాస్కర్‌రెడ్డి శ్రీశైలం, రూప్లా నాయక్, నర్సింలు, ఐలయ్య, రాములు, రమేష్, సాజిద్, జంగయ్య, అంజయ్యలతోపాటు పాల్గొన్నారు.