Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ మైలారం నాగపూర్ణశ్రీనివాస్
నవతెలంగాణ-గండిపేట్
కాలనీల్లో నీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని కౌన్సిలర్ నాగపూర్ణశ్రీనివాస్రెడ్డి, మాజీ వైస్ లంకల పాపిరెడ్డి అన్నారు. ఆదివారం నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రామం ఇందిరమ్మ కాలనీకి మంచినీటి సరఫరా వాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ఏర్పడినప్పటి నుండి నీటి సరఫరా లేదన్నారు. పేదల కాలనీలకు కొత్తగా పైపు లైన్ ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను దశలవారిగా అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు లక్ష్మణ్, కాలనీ అధ్యక్షులు శ్రీరాములు, శ్రీనివాస్, వాటర్ లైన్ మ్యాన్ లక్ష్మన్, శ్రీకాంత్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.