Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కొప్పు సుకన్య భాష
- జడ్పీటీసీ చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్య
నవతెలంగాణ-యాచారం
బి.యన్.రెడ్డి ట్రస్ట్ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం హర్షణీయమని ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జెడ్పిటిసి చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్యలు అన్నారు. ఆదివారం యాచారం మండల పరిధి నంది వనపర్తిలో బి.యన్.రెడ్డి ట్రస్టు తరఫున ఎన్పిఎల్-2 క్రికెట్ టోర్నమెంట్లో పది జట్లు, 180 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ట్రస్టు తరఫున మొదటి బహుమతి ని రూ.25 వేలు, సెకండ్ బహుమతి రూ.15600, మూడో బహుమతి రూ.5555లను గెలుపొందిన క్రీడాకారులకు చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి తో కలిసి వారు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకు బి.యన్.రెడ్డి ట్రస్ట్ అండగా నిలబడడం సంతోషించాల్సిన విషయమని తెలిపారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు అంతా సద్వినియోగం చేసుకోవడం అభినందించాల్సిన విషయమని చెప్పారు. దీంతో ట్రస్ట్ చైర్మన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే విధంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ, వార్డు సభ్యులు, సహకార సంఘం డైరెక్టర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.