Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైదుకూరు రమేష్ ఎంసిపిఐ ( యు) నాయకులు
నవతెలంగాణ-మియాపూర్
కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ఎం సిపిఐయు నాయకులు రమేష్ అన్నారు. ఎం సిపిఐ యు మియాపూర్ డివిజన్ మూడవ మా సభను నడిగడ్డ తాండలో ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని తెలిపారు. పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు ఒకరి పై ఒకరు పోటీ పడుతూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెద్ద ఎత్తున ధరలు పెంచుతూ మరోవైపు దేశ సంపదను కొన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజేప్పేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అనంతరం మహాసభ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
31 మందితో ఎం సిపిఐ ( యు) మియాపూర్ డివిజన్ కమిటీ
ఎం సిపిఐ యు మియాపూర్ డివిజన్ మహాసభ 31 మందితో కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ కార్యదర్శి గా కన్న శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా ఎం వై కుమార్ లను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. కమిటీ సభ్యులు వై.రాంబాబు, పల్లే మురళి, దశరత్ నాయక్, డీకే నారాయణ ఎల్ రాజు డి మధుసూదన్ యన్. గణేష్,ఎం రాజు చందర్ ఈశ్వరమ్మ మల్లేశ్వరి సుల్తానా ఇందిర శివాని ఎం రాణి లావణ్య దారలక్ష్మి విమల జి లలిత యస్. చంది బాయి, డి లక్ష్మి, రతన్ నాయక్ వెంకటాచారి శంకర్ శరణప్ప కే రాజు నరసింహ డి. శ్రీనివాసులు డి.రంగస్వామి లను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.