Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్
నవతెలంగాణ-గండిపేట్
ఎండల్లో వచ్చిన ప్రజలకు దహాం తీర్చేందుకు కృషి చేస్తున్నట్టు కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ గంధంగూడ మొదటి వార్డుల్లో రాజీవ్ గృహ కల్ప ప్రధాన రహదారిలో చల్లివేంద్రాన్ని ప్రారంభించారు. దారిలో వెళ్లే వారికి నీళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. కేకె నగర్ కాలనీకి చెందిన మాజీ అద్యక్షులు బివి కిరణ్ సహాకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు ధనుంజయ్, బత్తులా వేణుమాధవరావ్, వేంకటేష్ తదితరులు పాల్గొన్నారు.