Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
- పేద దళిత యువకుడు నాగరాజు హత్య దారుణం
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
కుల మతాంతర వివాహితులకు రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తేవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అతిథిగహం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రాములు, కెవిపిఎస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్‌తో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో దళిత, పేద యువకుడు నాగరాజు మతాంతర వివాహం చేసుకున్నాడన్న నెపంతో హత్య చేయడం దారుణమని అన్నారు. కులమతాలను రాజకీయ ప్రయోజనాలకే వాడుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల మతాంతర వివాహాలను చేసుకున్నవారికి రక్షణ కల్పించలేక పోతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వరకు ఇటువంటి హత్యలు జరగగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేక పోతుందని విమర్శించారు. కుల మతాంతర వివాహాలు రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.