Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతుల ధర్నా
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
రైతుల భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు పి. రామకృష్ణ, బుస చంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం బాధిత రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పూడూరు మండలం లో గల సర్వే నెంబర్లు 88.272.452 సర్వేనెంబర్ 458 సర్వేనెంబర్ 370 సర్వే నెంబర్ మన్నెగూడ పాయ గోల్ఫ్ పక్కన భూమి 371.451 భూమి ఉందన్నారు. ఈ భూమికి పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పట్టాల కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీలింగ్ భూమి, భూదాన్ భూములు, లావణి పట్టా, కాస్తులో రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరా రు. అలాగే రైతుబంధు డబ్బులు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సుల్తాన్పూర్ నర్సయ్య, వెంకయ్య, తిరుమలయ్య, రైతులు పాల్గొన్నారు.