Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజిక సేవల్లో రాణించాలి
- జాతీయ అధ్యక్షులు ఉప్పునూతల నాగరాజు
- రాష్ట్ర కో-ఆర్టినేటర్‌గా ఇలిటం గాలయ్య నియమాకం
- జాతీయ స్వచ్ఛంద జాయింట్ యాక్షన్ సమావేశం
నవతెలంగాణ-గండిపేట్, శంకర్పల్లి
జాతీయ స్వచ్ఛంద సేవా సమాజిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగ స్వాములవ్వాలని జాతీయ స్వచ్ఛంద సంస్థల ఎన్జీఓ జాక్ అధ్యక్షులు ఉప్పు నూతల నాగరాజు, ప్రధాన కార్యదర్శి రామ్ ప్రకాష్ అన్నారు. సోమవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో జాతీయ స్వచ్ఛంద సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సామాజిక సేవ సంస్థలు, ఎన్జీఓ నిర్వ హకులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడు తూ సమాజిక బాధ్యతగా ప్రకృతి పరిరక్షణ కోసం ముం దుకు రావాలన్నారు. స్వచ్ఛంద సేవల సంస్థలను స్థాపించి సామాజిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రా ష్ట్రంలో భరోసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గా సేవలందిస్తు న్న ఇలిటం గాలయ్యను రాష్ట్ర కో- ఆర్టినేటర్‌గా నియమించారు. వారి సేవలను అభినందిస్తూ బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా నియమితులైన ఇలిటం గాల య్య మాట్లాడుతూ... ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయులుగా సేవలందిస్తు న్నారు. ప్రస్తుతం మేడ్చేల్ జిల్లా కూకట్‌పల్లిలో పని చేస్తూ సామాజిక బాధ్యతగా ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు భరోసా ఫౌండేషన్ అనే సేవ స్వచ్ఛంద సంస్థను స్థాపించినట్టు తెలిపారు. మొక్కలను నాటడం ప్రధాన లక్ష్యమన్నారు. వాటిని పెంచడం వలన భవిష్యత్‌లో కలిగే లాభాలపై అవగహణ కల్పిస్తామన్నారు. బంధువులు, మిత్రులు శుభాకార్యమైతే బాధ్యతగా మొక్కను అందిస్తామన్నారు. గంటలో వాడి పోయే పూల దండలకు బదులుగా నిత్యం పూసే పూల మొక్కలను బహుమతులుగా అందించాల న్నారు. తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ 15 వందల మొక్కలను నాటించినట్టు తెలిపారు. తమ తమ పాఠశాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నిత్యం మొటివేట్ చేస్తూ మొక్కలను నాటించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచడానికి అవగహనా సదస్సులు, సమావేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆనాథ ఆశ్రమాలకు చేయుతతో పాటు పేద విద్యార్థుల చదువుల కోసం చేయుతని స్తామన్నారు. తమపై నమ్మకం ఉంచి ఈ పదవిని అ ప్పగించిన ఎన్జీఓ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లకు కృతజ్ఞ తలు తెలిపారు. సమాజిక, సేవా కార్యక్రమా లపై మరిం తా అవగాహన కల్పించేందుకు చివరి వరకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, నిర్వహకులు పాల్గొన్నారు.