Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనం పల్లి జైపాల్ రెడ్డి
- గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీి కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-రాజేంద్రనగర్
పారిశుధ్య కార్మికుల కోసం వినియోగిస్తున్న బయో మెట్రిక్ విధానం నెట్వర్క్ ప్రాబ్లం వలన సరిగా రాకపో వడంతో కార్మికులకు సరిగా జీతాలు రావడంలేదని వెంట నే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రేటర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులతో కలిసి ఆయన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జైపా ల్రెడ్డి మాట్లాడుతూ 20 ఏండ్ల క్రితం నుంచి వాడుతు న్నట్టు వంటి బయోమెట్రిక్ మిషన్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అన్నారు. నెట్వర్క్ రాకపోవడంతో మున్సిప ల్ పారిశుధ్య కార్మికులు పని చేసినా కార్మికులకు హాజరు రావడం లేదు అన్నారు. దానివలన రాజేంద్రనగర్ సర్కిల్ లో 450 మందికి జీతాలు 5వేలు కటై వచ్చినవి ఆయన అన్నారు. మరికొంత మంది కార్మికులకు పూర్తిగా జీతాలు రాలేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బయోమెట్రిక్ మిషన్ ప్రాబ్లం వల్ల కట్ అయిన జీతాలను వెంటనే కార్మికులకు బ్యాంకు ద్వారా జీతాలు వేయాలన్నారు. బయోమెట్రిక్ మిషన్లు పని చేయకుంటే అది కార్మికుల తప్పు కాదని అన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు చనిపోతే దాన సంస్కారాల ఖర్చుల కోసం రూ.20 వేల ఇవ్వాల న్నారు. కాంట్రాక్ట్ కార్మికుల అందర్నీ పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ లోకేష్కుమార్కి వినతిపత్రం అందజేశారు. వారం రోజుల్లో కార్మికులందరికీ పూర్తిగా జీతాలు చెల్లిస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో రాజేంద్రనగర్ మండల కార్యదర్శి పి.ఆనంద్ శ్రీను, నరసింహ, పెంటయ్య సంతోష, ప్రమీల, శ్యామలమ్మ, కార్మికులు పాల్గొన్నారు.