Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్
నవతెలంగాణ-మహేశ్వరం
ఉపాధిహామీ కూలీల వేతనాలను సకాలంలో చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జగన్ అన్నారు. సోమవారం మహేశ్వరం ఎంపీడీవో కార్యాలయం ముందు ఉపాధిహామీ కూలీల లబ్బులు, పే స్లిప్పులను సకాలంలో అందజేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలు ఎంత పనిచేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయో వారందరికి పే స్లిప్పులను అందజేయాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కేటాయింపులను తగ్గించి కూలీలను మోసం చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధికూలీలకు ఇచ్చే డబ్బులను సకాలంలో అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో మెడికల్ కిట్లను పంపిణీ చేయాలని ఆయన అన్నారు. ప్రతి కుటుంబానికీ 2 వందల రోజుల పనిని కలిపిస్తు, రోజుకు రూ.600ను పెంచాలని ఆయన అన్నారు. అనంతరం ఎంపీడీవో నర్సింహులుకు, ఏపీవో పరిమళకు మెమొరాండం అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ(ఎం) మండల ప్రధాన కార్యదర్శి అలువాల రవికుమార్, మండల కన్వీనర్ శేఖర్ నాయకులు సత్యనారాయణ, బాలయ్య, మల్లేష్, బాగ్య, జగన్, పుణ్యవతి, శ్యామల, రమేష్, శ్రీలత, గోపాల్, వివిధ గ్రామాల ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.